Raid 2 Movie | బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ‘రైడ్’. ఇలియానా కథానాయికగా నటించగా.. సౌరభ్ శుక్లా, సానంద్ వర్మ కీలక పాత్రల్లో నటించారు. 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.150 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఇక ఇదే సినిమాను తెలుగులో మిస్టర్ బచ్చన్ పేరిటా రీమేక్ చేయగా.. డిజాస్టార్‌గా నిలిచింది. అయితే 6 సంవత్సరాల తరువాత బాలీవుడ్లో ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
‘రైడ్ 2’లో కూడా అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తుండగా.. రితేష్ దేశ్‌ముఖ్, వాణి కపూర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాను మొదట ఫిబ్రవరి 21 2025 మహాశివరాత్రి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ఫిబ్రవరి నుంచి మేకి వాయిదా వేశారు. ఈ సినిమాను మే 1న విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ సినిమాకు రాజ్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, క్రిషన్ కుమార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
IRS Amay Patnaik’s next mission begins from May 2025!
Raid 2 is all set to release on 1st May 2025!@Riteishd @Vaaniofficial #RajatKapoor @rajkumar_rkg #BhushanKumar #KrishanKumar @KumarMangat @AbhishekPathakk @TSeries @PanoramaMovies #ShivChanana @neerajkalyan_24 pic.twitter.com/PyqU0rea1J— Ajay Devgn (@ajaydevgn) December 3, 2024