Mothevari Love Story | ప్రముఖ ఓటీటీ వేదిక Z5లో త్వరలో స్ట్రీమింగ్ కానున్న ‘మోతెవరి లవ్ స్టోరీ’ సిరీస్ నుంచి ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాడిన ‘గిబిలి గిబిలి’ అనే లవ్ సాంగ్‌ని మేకర్స్ తాజాగా విడుదల చేశారు. అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా రూపొందించారు. మధుర శ్రీధర్ రెడ్డి, శ్రీరామ్ శ్రీకాంత్ నిర్మాతలు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో రూపొందిన ఈ సిరీస్ ఆగస్ట్ 8న ZEE5లో స్ట్రీమింగ్ కానుంది.
హీరోయిన్‌కు తన ప్రేమను హీరో వ్యక్తపరిచే సందర్భంలో వచ్చే ఈ ‘గిబిలి గిబిలి’ పాటను మల్లెగోడ గంగ ప్రసాద్ రచించారు. సోషల్ మీడియాలో తరచుగా ఉపయోగించే పదాలతో ఈ పాటను రాయడం ఆకట్టుకుంటోంది. చరణ్ అర్జున్ ఈ పాటకు సంగీతం అందించారు. ఈ సిరీస్ టీజర్, ట్రైలర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.