ట్యాక్సీ వాలా సినిమాతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ సంకీర్త్యన్ (Rahul Sankrityan). ఈ యువ దర్శకుడు నానితో తెరకెక్కించిన శ్యామ్ సింగ రాయ్ (Shyam Singha Roy) ఇటీవలే ప్రేక్షకుల ముందుకు రాగా..మంచి టాక్ తెచ్చుకుంది. రాహుల్ డైరెక్షన్, నాని నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ దర్శకుడి కొత్త సినిమాకు సంబంధించిన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. బంగార్రాజు చిత్రంతో ప్రేక్షకులను అలరించిన నాగచైతన్య (Naga Chaitanya)తో రాహుల్ సంకీర్త్యన్ నెక్ట్స్ సినిమా ఉండబోతుందని టాక్ నడుస్తోంది.
గతంలోనే ఈ న్యూస్ తెరపైకి వచ్చినా..లేటెస్ట్ గా ఈ ప్రాజెక్టుపై రాహుల్, చైతూ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. కొత్త దనంతో కూడిన స్టోరీలను ప్రేక్షకులకు అందించేందుకు ఎప్పుడూ రెడీగా ఉండే రాహుల్ ఈ సారి టైం ట్రావెల్ ప్రాజెక్టుతో అందరిని పలుకరించాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నాడు. మరి చైతూ, రాహుల్ కాంబినేషన్ తెరపై ఎలా ఉండబోతుందనేది తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
నాగచైతన్య మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లాల్ సింగ్ చధా చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.