సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘రహస్యం ఇదం జగత్’. రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానసవీణ, భార్గవ్ గోపీనాథం ఇందులో ముఖ్యతారలు. కోమల్ ఆర్ భరద్వాజ్ దర్శకుడు. పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మాతలు. ఈ నెల 8న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయికలు స్రవంతి ప్రత్తిపాటి, మానసవీణ ఆదివారం విలేకరులతో ముచ్చటించారు. ‘ఇందులో నా పేరు అరుణి ఆచార్య. నా పాత్రతో పాటు ఈ కాన్సెప్ట్ నన్నెంతో ఆకర్షించింది. ఛాలెంజ్‌గా తీసుకొని చేసిన పాత్ర ఇది. దర్శకుడు ఎంతో పాషన్‌తో ఈ కథ రాసుకున్నారు.
భవిష్యత్‌లో ఆయన నుంచి మరిన్ని మంచి సినిమాలు ఆశించొచ్చు. అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది’ అని కథానాయిక మానసవీణ నమ్మకం వెలిబుచ్చారు. ‘ఇందులో నా పాత్ర పేరు అకిరా. అందరికీ నచ్చే పాత్ర ఇది. హనుమంతుడు వేరే లోకాలకు ట్రావెల్ చేసినప్పుడు ఏం జరిగింది? అనేది ఈ కథలో ఆసక్తికరమైన అంశం. టైమ్ ట్రావెల్ కూడా ఈ కథలో భాగమే. నిర్మాణ సమయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. దర్శకుడు కష్టపడి ఈ సినిమాను తీశారు. ఆడియన్స్‌కి మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అవుతుంది.’ అని స్రవంతి ప్రత్తిపాటి చెప్పారు.