శివ కంఠమనేని, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘రాఘవరెడ్డి’. సంజీవ్ మేగోటి దర్శకుడు. కేఎస్ శంకర్రావు, జి.రాంబాబు యాదవ్, ఆర్.వెంకటేశ్వరరావు నిర్మాతలు. జనవరి 5న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చిత్ర యూనిట్ మాట్లాడారు. రాఘవరెడ్డితో ప్రశంసలతోపాటు ఆర్థికలాభాలు కూడా వస్తాయని శివ కంఠమనేని నమ్మకం వెలిబుచ్చారు.
కూతురే ప్రపంచంగా బతికే తల్లిగా ఇందులో నటించానని, కథానాయికగా తాను చేసిన సినిమాలన్నింటిలో ఇది విభిన్నమైన సినిమా అని రాశి చెప్పారు. ఇది యాక్షన్ మూవీనా , ఫ్యాక్షన్ మూవీనా అనే అనుమానం చాలామందిలో ఉందని, అందరినీ ఆకట్టుకునే జానర్లో ఈ సినిమా చేశామని దర్శకుడు తెలిపారు. జనవరి 5న చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు. అన్నపూర్ణ, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, అజయ్, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: అంజన్, కెమెరా: ఎస్.ఎన్.హరీశ్