కోలీవుడ్ స్టార్ యాక్టర్ రాఘవా లారెన్స్ (Raghava Lawrence) తెలుగు, తమిళ భాషల్లో నటిస్తోన్న చిత్రం రుధ్రన్. తెలుగులో రుద్రుడు (Rudhrudu) పేరుతో విడుదలవుతుంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో కథిరేశన్ (Kathiresan) డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రాన్ని ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ బ్యానర్లో తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమా విడుదల తేదీని ఫైనల్ చేసింది లారెన్స్-కథిరేశన్ అండ్ టీం. కొత్త పోస్టర్ను విడుదల చేస్తూ..ఈ చిత్రాన్ని డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది చిత్రయూనిట్.
ఇక సెకండ్ లుక్ పోస్టర్లో రాఘవా లారెన్స్ చేతిలో వైన్ బాటిల్తో సోఫాపై కూర్చొని సీరియస్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తోండగా..కోలీవుడ్ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్. లారెన్స్ మరోవైపు పి వాసు డైరెక్షన్లో ఆల్ టైమ్ సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ చంద్రముఖి సీక్వెల్ చంద్రముఖి2లో కూడా నటిస్తున్నాడు.
Presenting the Second Look of @offl_Lawrence master in #Rudhran#Rudhran In Theaters Worldwide From December 23 2022#RudhranFromDecember23@offl_Lawrence @kathiresan_offl @realsarathkumar @gvprakash @priya_Bshankar @RDRajasekar @editoranthony @onlynikil pic.twitter.com/Tqntry9XTJ
— Five Star Creations LLP (@5starcreationss) July 3, 2022
Read Also : Pavitra lokesh | నరేశ్ మంచి వ్యక్తి..మీడియాతో పవిత్రా లోకేశ్..తెరపైకి మూడో భార్య..!