The Paradise | నాని ‘ది ప్యారడైజ్’ నుంచి రాఘవ్ జూయల్ ఫస్ట్ లుక్.. విక్రమ్ మాలిక్‌గా అదిరే ఎంట్రీ
The Paradise | స్టార్ నటుడు నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ చిత్రం ‘ది ప్యారడైజ్’ నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
The Paradise | స్టార్ నటుడు నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ చిత్రం ‘ది ప్యారడైజ్’ నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. బాలీవుడ్ నటుడు రాఘవ్ జూయల్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన పుట్టినరోజు సందర్భంగా జూన్ చిత్ర బృందం ‘విక్రమ్ మాలిక్’ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌లో రాఘవ్ జూయల్ పవర్ఫుల్ అండ్ అథారిటేటివ్ ‘విక్రమ్ మాలిక్’ పాత్రలో కనిపించారు. నిప్పులు, వాన, గందరగోళం మధ్య మెడలో భారీ గోల్డ్ చెయిన్స్‌తో కారుపై నుంచి దూకుతూ రగ్గడ్ అండ్ డేంజరస్ లుక్‌లో అదరగొట్టారు. “ఖాన్దాన్ కా షాన్, దోస్తోన్ కా జాన్.. విక్రమ్ మాలిక్ కి స్వాగతం సుస్వాగతం.. షెహర్ మేరా, నామ్ మేరా.. వెల్కమ్ టు జడల్ జమానా” అనే డైలాగ్ విక్రమ్ మాలిక్ పవర్‌ను చూపిస్తోంది. గ్లింప్స్ చివర్లో నాని ధగడ్ పాత్రలో, రాఘవ్ జూయల్ మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్ థియేటర్లలో పూనకాలు తెప్పించేలా ఉంది. అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ క్యారెక్టర్ ఎలివేషన్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది.
‘దసరా’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న రెండో చిత్రమిది. సికింద్రాబాద్‌లోని ఒక స్లమ్ నేపథ్యంలో పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో నాని, మోహన్ బాబు షికంజా మాలిక్ పాత్రలో, రాఘవ్ జూయల్, కాయాడు లోహర్ హీరోయిన్గా, సోనాలి కుల్కర్ణి, సంపూర్ణేష్ బాబు బిర్యానీ పాత్రలో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
woman found dead | మహిళ సూసైడ్.. ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నతాధికారి అరెస్ట్
Parvinder Singh Jhota | పర్వీందర్ సింగ్ ఝోటా హత్య కేసు.. డీఎస్పీ సహా డ్రగ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్
Arrest | హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
AP News | వైఎస్ జగన్ ఒక క్రిమినల్ లిటిగెంట్.. రాజకీయాల్లో ఇలాంటి వాళ్లు ప్రమాదకరం : చంద్రబాబు
AP News | ఏపీలోని 8 మున్సిపాలిటీల్లో నిలిచిన ఎన్నికల ప్రక్రియ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

