AP News | వైఎస్ జగన్ ఒక క్రిమినల్ లిటిగెంట్.. రాజకీయాల్లో ఇలాంటి వాళ్లు ప్రమాదకరం : చంద్రబాబు
AP News | స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అభ్యర్థులు, బూత్ స్థాయి కార్యకర్తలతో బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో జగన్ లాంటి 'క్రిమినల్ లిటిగెంట్లు' ఉండటం అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.
AP News : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అభ్యర్థులు, బూత్ స్థాయి కార్యకర్తలతో బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో జగన్ లాంటి ‘క్రిమినల్ లిటిగెంట్లు’ ఉండటం అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. తానే విధ్వంసానికి పాల్పడి తానే కోర్టుకు వెళ్లే వికృత ఆలోచనలు జగన్‌కే వస్తాయని చంద్రబాబు విమర్శించారు.
వైసీపీని ‘గొడ్డలి పార్టీ’గా అభివర్ణిస్తూ.. అభివృద్ధిని, ఎన్నికలను అడ్డుకోవడమే ఆ పార్టీ పనిగా పెట్టుకుందని చంద్రబాబు మండిపడ్డారు. కేవలం స్థానిక ఎన్నికలనే కాకుండా మెగా డీఎస్సీ, అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు వందల సంఖ్యలో పిటిషన్లు వేశారని ఆరోపించారు. ఓటరు జాబితా, బీసీ రిజర్వేషన్లపైనా కోర్టులకు వెళ్లి ఎన్నికల ప్రక్రియను అడ్డుకున్నారని గుర్తుచేశారు. స్థానిక ఎన్నికల్లో జనసేన, బీజేపీలతో సమన్వయం చేసుకుంటూ కూటమి అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పనిచేయాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తాము మంచి అభ్యర్థులను ఎంపిక చేస్తుంటే వైసీపీ మాత్రం విధ్వంసకారులను బరిలోకి దించుతోందని చంద్రబాబు ఆరోపించారు. బెంగళూరులో కూర్చొని జగన్ విధ్వంస రచనలు చేస్తున్నారని, ఇతర రాష్ట్రాల నుంచి గుండాలను దించేందుకు కుట్రలు పన్నుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారానికి వారం రోజులే సమయం ఉందని, ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు వివరిస్తూనే.. వైసీపీ అరాచకాలను, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కోరారు. వికృత మనస్తత్వం ఉన్నవారిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | వైఎస్ జగన్ ఒక క్రిమినల్ లిటిగెంట్.. రాజకీయాల్లో ఇలాంటి వాళ్లు ప్రమాదకరం : చంద్రబాబు
AP News | ఏపీలోని 8 మున్సిపాలిటీల్లో నిలిచిన ఎన్నికల ప్రక్రియ..!
Saurav Das | సౌరవ్ దాస్, రాంకాలకు అదనపు జుడీషియల్ కస్టడీ కోరిన పోలీసులు.. ఆర్డర్ రిజర్వ్ చేసిన కోర్ట్
DGP CV Anand | అమరుల త్యాగాలతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు.. నిజాయితీగా సేవ చేయడమే వారికి నిజమైన నివాళి: డీజీపీ సీవీ ఆనంద్
‘తమపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

