Parvinder Singh Jhota | పర్వీందర్ సింగ్ ఝోటా హత్య కేసు.. డీఎస్పీ సహా డ్రగ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్
Parvinder Singh Jhota : పంజాబ్‌లో డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడు పర్వీందర్ సింగ్ ఝోటా ఇటీవల హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించినందుకుగాను స్తానిక డీఎస్పీ హర్జిందర్ సింగ్ గిల్, డ్రగ్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్‌లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
Parvinder Singh Jhota : పంజాబ్‌లో డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడు పర్వీందర్ సింగ్ ఝోటా ఇటీవల హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యపై పంజాబ్ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో ఈ హత్య ఘటనను పంజాబ్‌లోని భగవంత్ మాన్ ఆధ్వర్యంలోని ఆప్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించినందుకుగాను స్తానిక డీఎస్పీ హర్జిందర్ సింగ్ గిల్, డ్రగ్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్‌లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఇప్పటివరకు ఈ కేసుపై విచారణను రాష్ట్ర పోలీసులు విచారణ చేయగా.. ఇప్పుడు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు. తమ ప్రభుత్వం పర్వీందర్ సింగ్ ఝోటా తండ్రి, కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. వారి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఝోటా కుటంబ వినతి మేరకు కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తున్నామని ప్రకటించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఝోటా కుటుంబం ఇటీవల డిమాండ్ చేసింది. దీంతో ఈ కేసును ఆప్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఇక, ఇద్దరు అధికారుల్ని సస్పెండ్ చేయగా.. ఇందుకు గల స్పష్టమైన కారణాల్ని మాత్రం ప్రభుత్వం పేర్కొనలేదు. మెడికల్ షాపు యజమాని వద్ద పిస్టల్ ఉన్నందున సరిగ్గా తనిఖీ చేసి, అక్రమ ఆయుధాల్ని అరికట్టని కారణంగా డీఎస్పీని, మెడికల్ షాపులో డ్రగ్స్ విక్రయిస్తున్నా చర్యలు తీసుకోనందున డ్రగ్స్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారని ప్రచారం జరుగుతోంది.
అక్టోబర్ 13న పంజాబ్‌లోని మాన్సాలోని ఒక మెడికల్ షాపులో నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తుండటంపై డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడు పర్వీందర్ సింగ్ ఝోటా ప్రశ్నించారు. ఈ క్రమంలో మెడికల్ షాపు యజమానితో వాగ్వాదం జరగగా.. అతడు ఝోటాను పిస్టల్‌తో కాల్చి చంపాడు. ఇదంతా పర్వీందర్ సింగ్ ఫేస్బుక్ లైవ్‌లో స్ట్రీమ్ అయింది. దీంతో ఈ హత్య ఘటనపై, డ్రగ్స్ విక్రయంపై స్తానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వెంటనే స్పందించి, చర్యలకు దిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvinder Singh Jhota | పర్వీందర్ సింగ్ ఝోటా హత్య కేసు.. డీఎస్పీ సహా డ్రగ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్
Arrest | హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
AP News | వైఎస్ జగన్ ఒక క్రిమినల్ లిటిగెంట్.. రాజకీయాల్లో ఇలాంటి వాళ్లు ప్రమాదకరం : చంద్రబాబు
AP News | ఏపీలోని 8 మున్సిపాలిటీల్లో నిలిచిన ఎన్నికల ప్రక్రియ..!
Saurav Das | సౌరవ్ దాస్, రాంకాలకు అదనపు జుడీషియల్ కస్టడీ కోరిన పోలీసులు.. ఆర్డర్ రిజర్వ్ చేసిన కోర్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

