woman found dead | మహిళ సూసైడ్.. ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నతాధికారి అరెస్ట్
woman found dead | అద్దె ఇంట్లో నివసిస్తున్న మహిళ అనుమానాస్పదంగా మరణించింది. ఆత్మహత్యకు పాల్పడిన ఆమె సూసైడ్ నోట్ రాసింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ పని చేసే ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన ఉన్నతాధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
గువాహటి: అద్దె ఇంట్లో నివసిస్తున్న మహిళ అనుమానాస్పదంగా మరణించింది. ఆత్మహత్యకు పాల్పడిన ఆమె సూసైడ్ నోట్ రాసింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ పని చేసే ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన ఉన్నతాధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. (woman found dead) అస్సాం రాజధాని గువాహటిలో ఈ సంఘటన జరిగింది. సువాల్కుచి ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల మహిళ ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేస్తున్నది. మంగళవారం ఆమె నివసించే హెంగ్రాబారి ప్రాంతంలోని అద్దె ఇంట్లో సూసైడ్ చేసుకున్నది.
కాగా, ఆ ఇంటి యజమాని సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. డోర్ బ్రేక్ చేసి ఇంట్లోకి వెళ్లి చూడగా ఆ మహిళ మృతదేహం సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆమె రాసిన ఒక సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ఆ మహిళ పని చేస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీ సీనియర్ అధికారి అయిన బిశ్వనాథ్ దాస్ తనను మానసికంగా, శారీరకంగా వేధించినట్లు ఆ నోట్లో ఆమె ఆరోపించింది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని పురూలియాకు చెందిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మహిళను ఆత్మహత్యకు అతడు ప్రేరేపించినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- arrested
- flat
- Found Dead
- Guwahati
RELATED ARTICLES
తాజా వార్తలు
woman found dead | మహిళ సూసైడ్.. ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నతాధికారి అరెస్ట్
Parvinder Singh Jhota | పర్వీందర్ సింగ్ ఝోటా హత్య కేసు.. డీఎస్పీ సహా డ్రగ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్
Arrest | హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
AP News | వైఎస్ జగన్ ఒక క్రిమినల్ లిటిగెంట్.. రాజకీయాల్లో ఇలాంటి వాళ్లు ప్రమాదకరం : చంద్రబాబు
AP News | ఏపీలోని 8 మున్సిపాలిటీల్లో నిలిచిన ఎన్నికల ప్రక్రియ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

