Radhika kumaraswamy | కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య కన్నడ ప్రముఖ నటి రాధికా కుమారస్వామి (Radhika kumaraswamy) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా పాన్ ఇండియన్ మూవీ ‘అజాగ్రత్త'(Ajaratha). ‘ది షాడోస్ బిహైండ్ ద కర్మ’ అనేది ఉపశీర్షిక. మైథలాజికల్ ఫాంటసీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు శశిధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఇదిలా ఉంటే.. ఆదివారం రాధిక కుమారస్వామి బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఆమె ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్లో ఏరుపు రంగు చీర ధరించి ఒంటినిండా బంగారు నగలతో నవ్వుతూ.. ట్రెడిషనల్ లుక్‌లో రాధిక కనిపిస్తుంది. ఇక చిత్రంతో బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్ఫడే సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుండగా.. సునీల్, రావురమేష్ తదితరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Team #Ajagratha wishes @Rkumar_Swamy a very happy birthday with a striking poster@shreyastalpade1@shashi94m @suneeltollywood#RaviRaj #SandeepValluri#ShriHari @PROSaiSatish#HappyBirthdayRadhikaKumaraswamy pic.twitter.com/FGmGXzSR39
— Vamsi Kaka (@vamsikaka) November 12, 2023
మరోవైపు రాధికా కుమారస్వామి నటిస్తున్న ఇంకో క్రేజీ ప్రాజెక్టు ‘భైరా దేవీ’. ఈ సినిమా నుంచి కూడా రాధిక బర్త్ డే సందర్భంగా స్పైషల్ పోస్టర్‌తో పాటు మేకర్స్ వీడియో విడుదల చేశారు. ఇక భైరా దేవీ మూవీలో రాధిక ఓ అఘోరగా కనిపించనుంది. ఈ రెండు పోస్టర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Here’s to another year of success, happiness, and amazing adventures for @RadhikaKumaraswamy! 🎂 #HBDRadhikaKumaraswamy pic.twitter.com/SzHdDMWkO2
— Akshay Pratap Singh 🇮🇳🇮🇳 (@akshay_1111997) November 12, 2023