Radheshyam valentine glimps | మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీస్‌లో రాధేశ్యామ్ ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, ప్రశీదలు సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు,ట్రైలర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను నమోదు చేశాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంతో విడుదల వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రాన్ని మార్చి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో వాలెంటైన్స్ డే సందర్భంగా రాధేశ్యామ్ చిత్రం నుండి వాలెంటైన్స్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
‘మళ్లీ లైఫ్‌లో వాడి మొహం చూడను,కుక్ చేస్తావ్ బాగా మాట్లాడుతావ్ ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్ళి ఎందుకు కాలేదు’ అంటూ ట్రైలర్లో పూజా చెప్పిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. నా లక్కీ నెంబర్ 100 అంటూ ప్రభాస్ ముద్దుల విషయంలో ఈ అంకె చెప్పినట్లు తెలుస్తుంది. పిరీయాడిక్ లవ్‌స్టోరిగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృష్ణంరాజు కీలక పాత్రలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అత్యంత భారీగా దాదాపు 300కోట్లతో నిర్మించినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ చిత్రానికి నాన్-థియేట్రికల్ హక్కులు అన్ని భాషలకు కలుపుకొని 200కోట్లకు డీల్ కుదిరిందని సమాచారం.
Telugu : https://t.co/2DChmhjb43
Hindi : https://t.co/lehLk0d8rL
Tamil : https://t.co/bF9kWAFxzE
Kannada : https://t.co/YdNUjE0hN0
Malayalam :https://t.co/diBBjEO1eV pic.twitter.com/IKjig0k8Yi— UV Creations (@UV_Creations) February 14, 2022