పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కొత్త సినిమా రాధే శ్యామ్. ఈ సినిమాలో పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గోపీకృష్ణా మూవీస్ పతాకంపై కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రమోద్, వంశీ, ప్రసీద నిర్మాతలు. కరోనా థర్డ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడిన రాధే శ్యామ్ మార్చి 11న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నది.
తెలుగు, హిందీలో చిత్రీకరణ జరుపుకున్న రాధే శ్యామ్.. ఈ రెండు భాషలతోపాటు దక్షిణాది భాషలైన తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. తమిళనాట ఈ సినిమాను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన పంపిణీ సంస్థ విడుదల చేస్తున్నది. ఇంగ్లీష్‌లో డిస్నీ సంస్థ డిస్ట్రిబ్యూషన్‌కు ముందుకొచ్చిందని సమాచారం. ప్రాజెక్ట్ కున్న క్రేజ్ దృష్ట్యా రాధే శ్యామ్ అత్యధికంగా 20 వేల థియేటర్లలో తెరపైకి రానుందని తెలుస్తోంది.
విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ సినిమా విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తాజాగా సినిమా రన్ టైమ్ ను నిర్ణయించినట్లు సమాచారం. 2 గంటల 31 నిమిషాల రీజనబుల్ రన్ టైమ్‌తో రాధే శ్యామ్ తెరమీదకు వస్తోందని సమాచారం. ఈ రన్ టైమ్ ఉన్న సినిమాలు సాగతీత లేకుండా క్రిస్ప్‌గా రెండు అర్థభాగాలతో ఆకట్టుకునేలా ఉంటాయనేది ఫిల్మ్ లవర్స్ మాట. పలు భాషల్లో విడుదలవుతున్న కారణంగా…ఈ రన్ టైమ్ ను అన్నింటికీ ఒకేలా ఉంచుతారా లేక తగ్గించడం పెంచడం చేస్తారా అనేది చూడాలి.