ఏపీలో సినిమా ఇండస్ట్రీ పరిస్థితులన్నీ చక్కబడిన తరువాత విడుదలవుతున్న తొలి పెద్ద సినిమా రాధే శ్యామ్. దాంతో ఈ సినిమా ఓపెనింగ్ రికార్డులు కూడా ఘనంగా ఉండబోతున్నాయి. ఈ ప్రేమకథ కోసం ఆడియన్స్ ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా రాధే శ్యామ్ (Radhe Shyam) విడుదల కానుంది. ఈ సినిమాను థియేటర్స్‌లో ఎక్స్పీరియన్స్ చేయడానికి అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.
అందుకే ఈ చిత్రం నుంచి ఏ చిన్న విజువల్ వచ్చినా కూడా పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా రిలీజ్ ట్రైలర్ విడుదలైన తర్వాత.. సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇప్పుడు యుఎస్ ప్రీమియర్స్‌లో సినిమా సరికొత్త రికార్డులకు తెరతీస్తుంది. ఓవర్సీస్లో రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ప్రీమియర్స్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటేనే ఇది అర్థమవుతుంది. చాలా సినిమాల లైఫ్ టైమ్ కలెక్షన్స్ రాధే శ్యామ్ కేవలం ఒక్కరోజులోనే క్రాస్ చేసేలా కనిపిస్తుంది.
రాధే శ్యామ్ ఈ సీజన్లోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాల్లో ఒకటి. ఈ లార్జర్ దెన్ లైఫ్ ప్రపంచం ఉన్న సినిమా కోసం అభిమానులు చాలా కాలంగా వేచి చూస్తున్నారు. అలాగే మొన్న విడుదల చేసిన NFT కలెక్షన్స్‌కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బుకింగ్స్ ఓపెన్ చేసిన కేవలం 3 నిమిషాల్లోనే 2 లక్షలకు పైగా NFTలు అమ్ముడయ్యాయి. కొన్నిచోట్ల ఏకంగా సర్వర్స్ కూడా క్రాష్ అయ్యాయంటే సినిమాపై క్రేజ్ ఎంత ఉందో అర్థమైపోతుంది. అందుతున్న సమాచారం ప్రకారం..అన్నిచోట్లా రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ రావడం ఖాయం అయిపోయింది.
టికెట్స్ అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో (telugu states) కచ్చితంగా రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ రాబోతున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు హిందీ, ఓవర్సీస్ నుంచి కూడా కచ్చితంగా రికార్డు కలెక్షన్స్ రాబోతున్నాయి. ఓవర్సీస్లో అయితే ప్రీమియర్స్ నుంచే 1 మిలియన్ అంతకంటే ఎక్కువగానే క్రాస్ అయ్యేలా కనిపిస్తుంది రాధే శ్యామ్. మార్చ్ 11న విడుదల కానున్న ఈ మ్యాగ్నమ్ ఓపస్‌ను రాధాకృష్ణ కుమార్ (Radhakrishna kumar) తెరకెక్కించారు. పాన్ ఇండియన్ సినిమాగా వస్తున్న రాధే శ్యామ్‌లో పూజా హెగ్డే హీరోయిన్గా నటించారు. డాక్టర్ యువీ కృష్ణంరాజు గోపీకృష్ణ మూవీస్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించారు.