Radhe Shyam | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటున్నాడు. లేటెస్ట్గా ఈ చిత్ర తమిళ ప్రీ రిలీజ్ వేడుక చెన్నైలో జరిగింది. పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ‘జిల్’ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ట్రైలర్లు సినిమా పైన భారీ అంచనాలను నమోదు చేశాయి. ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘రాధేశ్యామ్’ చిత్రానికి 300కోట్ల బడ్జెట్ అయ్యిందట. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులకు భారీగా డీల్ కుదిరిందని సమాచారం. రాధేశ్యామ్ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్ సంస్థ అన్ని భాషలకు కలిపి దాదాపు 150కోట్ల భారీ ధరకు విక్రయించిందని సమాచారం. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తరువాతే ఓటీటీలో స్ట్రీమింగ్ జరగనుందట. గోపి కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, ప్రశీదలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రభాస్‌కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది.