Mardaani 3 Trailer | మరోసారి ఖాకీ డ్రెస్ వేసిన రాణి ముఖర్జీ.. వణుకు పుట్టిస్తున్న ‘మర్దానీ 3’ ట్రైలర్!
Mardaani 3 Trailer | బాలీవుడ్ సీనియర్ నటి రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ ‘మర్దానీ 3’ (Mardaani 3) ట్రైలర్ తాజాగా విడుదలైంది.
Mardaani 3 Trailer | బాలీవుడ్ సీనియర్ నటి రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ ‘మర్దానీ 3’ (Mardaani 3) ట్రైలర్ తాజాగా విడుదలైంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శివానీ శివాజీరాయ్ పాత్రలో రాణి ముఖర్జీ మరోసారి విశ్వరూపం చూపించబోతోంది. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో రెండు సినిమాలు రాగా.. సూపర్ హిట్‌ను అందుకున్నాయి. ఇప్పుడూ తాజాగా మూడో సినిమా విడుదల కాబోతుంది.
ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే.. దేశంలో వేల సంఖ్యలో అదృశ్యమవుతున్న బాలికల చుట్టూ ఈ కథ తిరుగబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా హ్యూమన్ ట్రాఫికింగ్ మరియు భయంకరమైన ‘బెగ్గర్ మాఫియా’ ముఠాల అరాచకాలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారి ‘అమ్మ’ అనే క్రూరమైన మహిళను పట్టుకోవడానికి శివానీ చేసే పోరాటం ఏంటి అనేది ఈ సినిమా కథ.
బాలీవుడ్లో రాణి ముఖర్జీ ప్రస్థానం 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమాను ఒక మైల్‌స్టోన్‌గా యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. అభిరాజ్ మినావాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మించారు. రాణి ముఖర్జీతో పాటు ‘శైతాన్’ ఫేమ్ జానకి బొడివాలా కీలక పాత్రలో కనిపిస్తుండగా, మల్లికా ప్రసాద్ విలన్‌గా మెప్పించనుంది. ఈ చిత్రం జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

