Raakh Trailer | ‘పాతాళ్ లోక్’ దర్శకుడి కొత్త వెబ్‌సిరీస్..ఉత్కంఠరేపుతున్న ‘రాఖ్’ ట్రైలర్
Raakh On Prime | ఓటీటీ ప్రియులకు సరికొత్త వినోదాన్ని పంచేందుకు మరో విలక్షణమైన వెబ్‌సిరీస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేందుకు సిద్ధమైంది.
Raakh On Prime | ఓటీటీ ప్రియులకు సరికొత్త వినోదాన్ని పంచేందుకు మరో విలక్షణమైన వెబ్‌సిరీస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ నటుడు, ‘మీర్జాపూర్’ ఫేమ్ అలీ ఫజల్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ ‘రాఖ్’ (Raakh). ప్రముఖ ఓటీటీ సంస్థ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video) ఒరిజినల్‌గా రూపొందిన ఈ ప్రతిష్టాత్మక సిరీస్ జూన్ 12 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది. సమాజంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా అద్భుతమైన సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
గతంలో ‘పాతాళ్ లోక్’ వంటి సూపర్ హిట్ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసిన ప్రముఖ దర్శకుడు ప్రొసిత్ రాయ్ ఈ సిరీస్‌ను రూపొందించడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సరికొత్త సిరీస్‌లో అలీ ఫజల్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా, సీనియర్ నటి సోనాలీ బింద్రే, ఆమిర్ బషీర్ కీలక పాత్రలు పోషించారు. ఇద్దరు టీనేజర్లు అనుమానాస్పద స్థితిలో అదృశ్యమవ్వడం, ఆ మిస్సింగ్ కేసును ఛేదించే క్రమంలో సదరు పోలీస్ అధికారికి ఎదురైన సవాలుతో కూడిన పరిస్థితులు, ఊహించని మలుపుల చుట్టూ ఈ కథ నడుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

