R.Madhavan son won gold medal | సౌత్ నుంచి నార్త్ వరకు ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉన్న నటుడు మాధవన్. అప్పట్లో యూత్‌లో ఈయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. తెలుగు, తమిళం, హిందీ ఇలా పలు భాషల్లో సినిమాలను చేస్తూ సక్సెస్ ఫుల్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మాధవన్ తన కొడుకు సక్సెస్‌ను చూసి మురిసిపోతున్నాడు. డెన్మార్క్‌లోని కోపెన్ హాగెన్‌లో నిర్వహించిన స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్లో వేదాంత్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఈయన తనయుడు వేదాంత్ మాధవన్ స్విమ్మింగ్ పోటీల్లో ఆదివారం ఇండియా తరుపున సిల్వర్ మెడల్ సాధించిగా.. తాజాగా గోల్డ్ మెడల్ కూడా సాధించి ఇండియా మొత్తం గర్వపడేలా చేశాడు.
తన తనయుడు మరో మెడల్ గెలుచుకున్న విషయాన్ని మాధవన్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.
వేదాంత్‌కు గోల్డ్ మెడల్ ప్రకటిస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. డానిష్ ఓపెన్ 2022లో వేదాంత్ 800 మీటర్ల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్లో మొదటి స్థానంలో నిలిచాడు. ఆదివారం కేవలం 10మిల్లీ సెకన్ల తేడాతో గోల్డ్ కోల్పోయిన వేదాంత్ సోమవారం సక్సెస్ ఫుల్‌గా రేసును పూర్తి చేసి భారత్ తరుపున బంగారు పతకాన్ని సాధించాడు. ఈ సందర్భంగా పలువరు ప్రముఖులతో పాటు నెటీజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.