కౌన్ బనేగా కరోడ్‌పతి.. అత్యంత ప్రజాదరణ కలిగిన షో. దీనికి బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం 16వ సీజన్ కొనసాగుతున్నది. ఇందులో ప్రతి ప్రశ్నకు అమౌంట్ పెరుగుతూ పోతుంది. పాల్గొనే కంటెస్టెంట్లను బట్టి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఈ క్రమంలో శుక్రవారం నాటి ఎపిసోడ్లో వృద్ధ దంపతులు హాట్‌సీట్‌లోకి వచ్చారు. రూ.80 వేల ప్రశ్న వరకు విజయవంతంగా సమాధానాలు చెప్పారు. అయితే అమితాబ్ అడిగిన ఆ తర్వాతి ప్రశ్న వారిని కొంత అయోమయానికి గురిచేసింది. సమాధానం తెలియక పోవడంతో వారు లైఫ్‌లైన్‌ను వినియోగించుకోవాల్సి వచ్చింది.. దాని విలువ ఎంతో తెలుసా.. అక్షరాలా లక్షా 60 వేలు. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. 2024 జూన్‌లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సినీ నటుడు ఎవరు?.
దానికి పవన్ కల్యాణ్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ అనే ఆప్షన్లను అమితాబ్ వారికి ఇచ్చారు. అయితే, వారికి ఈ ప్రశ్నకు సమాధానం తెలియలేదు. దీంతో లైఫ్‌లైన్ వినియోగించుకుని ఆడియన్స్ పోల్‌ను ఎంపిక చేసుకున్నారు. 50 శాతానికిపైగా పవన్ కల్యాణ్ అని ఆడియన్స్ పోల్ చేశారు. దీంతో వారు కూడా అదే ఆప్షన్ లాక్ చేశారు. దీంతో రూ.1,60,000 ప్రశ్నను వారు సక్సెస్‌ఫుల్‌గా దాటేశారు.
అనంతరం ఆ కంటెస్టెంట్లకు జనసేనాని గురించి చెబుతూ.. పవన్ కళ్యాణ్ అద్భుతమైన నటుడు. చిరంజీవి ఉన్నారు కదా.. ఆయనకు ఇతను చిన్న తమ్ముడు అవుతాడు అంటూ అమితాబ్ ఇంట్రడక్షన్ ఇచ్చాడు. జనసేన పార్టీ పెట్టాడు.. ఈ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారంటూ వివరించాడు. కేబీసీలో పవన్ కల్యాణ్‌పై వచ్చిన ప్రశ్నకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అభిమానులు, జన సైనికులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. కాగా, కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రతీ సోమవారం నుంచి శుక్రవారం వరకు సోనీ టీవీలో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతున్నది. సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనూ చూడొచ్చు. ఈ 16వ సీజన్ ఈ ఏడాది ఆగస్టు 12న ప్రారంభమైంది.
जनसेना पार्टी के प्रमुख श्री पवन कल्याण आंध्र प्रदेश की नई उपमुख्यमंत्री। यह अद्भुत कलाकार है, चिरंजीवी का छोटा भाई @PawanKalyan -श्री @SrBachchan जी #KBC #PawanKalyanAneNenu pic.twitter.com/ojdgGRYRzg
— PRAKASH JANASENA 🇮🇳 (@Jspsaiprakash) September 13, 2024