జాకీఫ్రాఫ్, ప్రియమణి, సన్నీలియోన్, సారా అర్జున్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘క్యూజీ గ్యాంగ్ వార్’. వివేక్‌కుమార్ కన్నన్ స్వీయ దర్శకత్వంలో ఎం.వేణుగోపాల్, గాయత్రి సురేశ్‌లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 30న అయిదు భాషల్లో సినిమా విడుదల కానుంది. ఎన్టీఆర్ శ్రీను సమర్పణలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వరల్డ్‌వైడ్ రిలీజ్ హక్కులను రిషికేశ్వర్ ఫిల్మ్స్ బ్యానర్ కింద నిర్మాత వేణుగోపాల్ సొంతం చేసుకున్నారు.
సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన టి.ప్రసన్నకుమార్, దామోదర్‌ప్రసాద్, శివనాగు, శ్రీను, తదితరులు సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షిచారు. ఇది వైవిధ్యమైన సినిమా అనీ, యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి ఇది విందుభోజనం లాంటి సినిమా అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అరుణ్ పద్మనాభన్, సంగీతం: డ్రమ్స్ శివమణి.