Pushpaka Vimanam Collections | ‘పుష్పక విమానం’ 4 డేస్ కలెక్షన్స్..కోటి షేర్ కూడా రాలేదుగా..!
ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) హీరోగా దామోదర తెరకెక్కించిన సినిమా పుష్పక విమానం (Pushpaka Vimanam). నవంబర్ 12న విడుదలైన ఈ చిత్రానికి ఏమంత గొప్ప టాక్ రాలేదు. టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది.

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తమ్ముడు ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) హీరోగా దామోదర తెరకెక్కించిన సినిమా పుష్పక విమానం (Pushpaka Vimanam). తమ్ముడిని హీరోగా నిలబెట్టడానికి రౌడీ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారిపోయాడు. విజయ్ దేవరకొండ సొంత బ్యానర్ ‘కింగ్ ఆఫ్ ది హిల్’ ఎంటర్టైన్మెంట్స్, ‘టాంగా ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. నవంబర్ 12న విడుదలైన ఈ చిత్రానికి ఏమంత గొప్ప టాక్ రాలేదు. టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది.
ముఖ్యంగా పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్తో వస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ సినిమాలో మాత్రం మర్డర్ మిస్టరీ ఉండటంతో ఆడియన్స్ షాక్ అయ్యారు. ఇదే పుష్పక విమానం సినిమాకు నెగిటివ్ అయిపోయింది. గీత్ సైనీ, శాన్వీ మేఘన ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ప్రమోషన్ బాగానే చేసుకున్నా కూడా పుష్పక విమానం కలెక్షన్స్ విషయంలో మాత్రం దారుణంగా నిరాశ పరిచింది. తొలిరోజు కేవలం 45 లక్షలు షేర్ మాత్రమే తీసుకొచ్చింది ఈ చిత్రం. ఆ తర్వాత కూడా పుంజుకోలేదు. తాజాగా ఈ సినిమా 4 డేస్ కలెక్షన్స్ బయటికి వచ్చాయి. ఇప్పటి వరకు కేవలం 99 లక్షలు మాత్రమే వసూలు చేసింది ఈ చిత్రం.
అంటే కనీసం కోటి షేర్ కూడా అందుకోలేదు ‘పుష్పక విమానం’. మరోవైపు ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే రూ. 2.5 కోట్లు రావాల్సిందే. బ్రేక్ ఈవెన్ మార్కుకు కనీసం కోటిన్నర దూరంలోనే ఆగిపోయేలా కనిపిస్తుంది పుష్పక విమానం. మిడిల్ క్లాస్ మెలోడిస్ సినిమాతో పర్లేదనిపించిన ఆనంద్ దేవరకొండ.. పుష్పక విమానంతో హిట్ కొట్టి సొంతంగా మార్కెట్ ఓపెన్ చేసుకోవాలని కలలు కన్నాడు కానీ ఈ సినిమా ఆ కలలేం నెరవేర్చేలా కనిపించడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల నుంచి సినిమా సేఫ్ అవ్వాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. కానీ అద్భుతాలు బాక్సాఫీస్ దగ్గర అస్తమానం జరగవు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Puneeth Rajkumar Award | దివంగత పునీత్ రాజ్‌కుమార్‌కు అరుదైన గౌరవం
Sushant Singh | ఘోర రోడ్డు ప్రమాదం.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్యామిలీలో ఐదుగురు మృతి
Biker Naatu Naatu Dance | ట్రాఫిక్ సిగ్నల్‌లో బైకర్ ‘నాటు నాటు’ డ్యాన్స్ ..వీడియో హల్చల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

