Pushpa 2 The Rule | మరో 06 రోజుల్లో పుష్ప 2 సందడి మొదలు కానున్న విషయం తెలిసిందే. ఎప్పుడెప్పుడా అని బన్నీ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో అదరగొడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అన్ని భాషల్లో కలిపి ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లకు పైగా జరిగినట్లు సమాచారం. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం విడుదల పరంగా మరో రికార్డును నమోదు చేయబోతుంది.
ఈ సినిమా విడుదలకు సంబంధించి వరల్డ్ వైడ్‌గా మొత్తం ఆరు భాషల్లో కలిపి 12000 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదల కాబోతున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు రాజమౌళి ఆర్ఆర్ఆర్ పేరిటా ఉన్న ఈ రికార్డు బద్దలవ్వనుంది. ఆర్ఆర్ఆర్ చిత్రం 10200 లుకు పైగా స్క్రీన్స్‌లో విడుదల అయ్యింది. ఇప్పటివరకు ఇండియన్ సినిమాలలో బిగ్గెస్ట్ రిలీజ్ అయిన చిత్రం ఇదే. అయితే ఈ రికార్డును పుష్ప అధిగమించబోతుంది. ఓవర్సీస్లో 5500 వేల స్క్రీన్స్, ఇండియాలో 6500 స్క్రీన్స్‌లో కలిపి మొత్తం 12000 స్క్రీన్స్‌లో పుష్ప 2 విడుదల కాబోతున్నట్లు సమాచారం.
#Pushpa2TheRule to be released in 1️⃣2️⃣0️⃣0️⃣0️⃣+ screens across the world. pic.twitter.com/vDENQptzFT
— Manobala Vijayabalan (@ManobalaV) November 29, 2024