ఆర్య, ఆర్య2 చిత్రాల తర్వాత సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం పుష్ప. రెండు పార్ట్‌లుగా రూపొందుతున్న ఈ చిత్రం తొలి పార్ట్ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్ స్పీడ్ పెంచారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘దాక్కో దాక్కో మేక’ అనే పాట విడుదల చేశారు మేకర్స్. విడుదలైన కొంత సమయంలోనే ఈ పాట సోషల్‌మీడియాలో వైరల్ అయింది.
తెలుగులో శివం, హిందీలో విశాల్ దడ్లాని, కన్నడంలో విజయ ప్రకాష్, తమిళంలో బెన్నీ దయాల్, మలయాళంలో రాహుల్ నంబియార్ ఈ పాటని ఆలపించారు. సెకండ్ సాంగ్ ఎప్పుడు విడుదల అవుతుంది అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నక్రమంలో మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. సెకండ్ సాంగ్‌ని అద్భుతమైన లొకేషన్లో చిత్రీకరించినట్టు ఫొటోని విడుదల చేసి, త్వరలోనే సాంగ్‌కి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. సిద్ శ్రీరామ్‌తో సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ పాడించారు అని తెలుస్తోంది.
ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందింది. అల్లు అర్జున్‌కు జోడిగా రష్మిక మందన్న నటిస్తోంది. ఈ చిత్రంలో శాండల్‌వుడ్ యువ నటుడు ధనంజయ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.