Pushpa The Rule | పుష్ప 2 ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ట్రైలర్‌పై అటు యూట్యూబ్‌తో పాటు నెట్టింటా చర్చించుకుంటున్నారు అభిమానులు. కొందరు ఏమో ఈ ట్రైలర్ చూసి కథ మొత్తం ఇది చెబుతుండగా.. మరికొందరు సినిమాలో ఉన్న కీలకమైన విషయాలను పసిగడుతున్నారు. తాజాగా ఒక నెటిజన్ ఏకంగా పుష్ప ట్రైలర్‌ను డీకోడ్ చేశాడు.
ఇందులో పుష్పతో గొడవ అయిన అనంతరం అతడిని అంతమొందించడానికి ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ వెళ్లి మంగళం శ్రీనుతో చేతులు కలిపినట్లు తెలుస్తుంది. మరోవైపు పార్ట్ 2లో పుష్పకి ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో రెండు పెద్ద ఫైట్స్ ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో ఒకటి గంగమ్మ జాతర ఫైట్ కాగా.. మరోకటి పోర్ట్ ఏరియాలో జరిగేది అని టాక్. అలాగే ఈ చిత్రంలో పుష్పకి చాలా దగ్గరైన వ్యక్తి చనిపోయినట్లు కూడా చూపించడం చూడవచ్చు. ఇవే కాకుండా కన్నడ నటుడు తారక్ పోన్నప్పకి అరగుండు కొట్టించి చెప్పులతో ఊరేగించే సీన్, డాలీ ధనంజయ సీన్, ఎర్రచందనం దుంగలుగా పేర్చి పుష్ప ఉండే సీన్స్ మూవీకి హైలైట్‌గా నిలవబోతున్నట్లు తెలుస్తుంది. అయితే పుష్ప ఏం చేస్తాడో తెలియాలంటే డిసెంబర్ 06 వరకు ఆగాల్సిందే.
PUSHPA TRAILER LO nenu observe chesinavi …ala kindha pedthunna
Thread 🧵 follow ipondi #Pushpa2TheRuleTrailerday pic.twitter.com/FR4ipgosRo— Oggg🦅 (@KottapalliAbhi2) November 17, 2024