Pushpa-2 Movie | ఎప్పుడెప్పుడా అని లక్షలాది అభిమానులు ఎదురు చూసిన పుష్ప-2 రిలీజ్ డేట్ వచ్చేసింది. అందరి ఊహలకు భిన్నంగా వచ్చే ఏడాది ఆగస్టు 15వ డేట్‌ను లాక్ చేసుకుంది. ఇక పుష్ప-2 పై ప్రేక్షకుల్లో మాములు అంచనాల్లేవు. బన్నీ ఈ సారి వెయ్యి కోట్లు కొల్లగొట్టడం పక్కా అని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. దానికి తగ్గట్టే సుక్కు సైతం సినిమాను వేరే లెవల్‌కు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ వీడియో టాలీవుడ్‌తో సహా అన్ని వుడ్‌లలోనూ సంచలనాలు సృష్టించింది. జస్ట్ గ్లింప్సే ఆ రేంజ్లో ఉంటే సినిమా ఇంకా ఏ లెవల్లో ఉండబోతుందో అని తెగ ఆసక్తితో ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి వదిలిన పోస్టర్‌పై ఓ సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది.
పుష్ప ది రూల్ 2024 ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుందని మేకర్స్ రీసెంట్ గా ఒక కొత్త పోస్టర్ వదిలారు. అయితే ఆ పోస్టర్లో పుష్పరాజ్ చిటికన వేలు గోరును హైలైట్ చేస్తూ చూపించడంతో దాని వెనుక కథేంటి? అంటూ అభిమానులతో పాటు నెటిజెన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ గోరు వెనుక ఉన్న సీక్రెట్‌పై ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
కొన్ని సంస్కృతులలో పురుషులు తమ సంపదను, సమాజంలో తమకు ఉన్న స్థానాన్ని చూపించేందుకు చిటికెన వేలు గోరు పెంచుకుంటారని. మేము కేవలం రూల్ చేయడానికి మాత్రమే ఉన్నామని చూపించడానికి ఈ గోరు తెలియజేస్తుందని చెబుతున్నారు. ఇక ఎర్ర చందనం వ్యాపారాన్ని పుష్ప చిటికెన వేలుపై నిలబెట్టాడని సూచనగా దాన్ని హైలైట్ చేస్తున్నట్టు టాక్. అందుకే పుష్పరాజ్ కూడా చిటికన వేలు గోరు పెంచుకున్నాడని అంటున్నారు. కాగా ఈ విషయం తెలిసి బన్నీ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఇదే నిజమైతే రిలీజ్ తర్వాత వరల్డ్ రికార్డులు కొల్లగొడుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఫహద్ ఫాసిల్ జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.