Sukumar | సుకుమార్ సంచలన నిర్ణయం..‘పుష్ప’ లో కట్టప్ప అతడేనా..?
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar ) తెరకెక్కిస్తున్న పుష్ప (Pushpa)సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ ప్రాజెక్టులో బాహుబలి లాగే కట్టప్ప పాత్ర ఒకటి ఉంటుందన్న వార్త తెరపైకి వచ్చింది.

అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) తెరకెక్కిస్తున్న పుష్ప (Pushpa)సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దానికి తోడు సినిమాకు ప్రమోషన్ కూడా అలాగే ఉంది. అన్నింటికీ మించి రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దర్శకుడు సుకుమార్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆకాశంలో అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తున్నారనే విషయంపై ఇప్పటికీ ఒక క్లారిటీ రాలేదు. మెయిన్ విలన్ గా మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాసిల్ కన్ఫామ్ అయ్యాడు. కానీ పుష్ప సినిమాలో మరో ఇద్దరు ప్రతినాయకులు కూడా ఉంటారని తెలుస్తోంది. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. పైగా బాహుబలి సినిమా తరహాలో ఇందులో కూడా ఒక కట్టప్ప (Kattappa) ఉంటాడని..వెన్నంటే ఉండి వెన్నుపోటు పొడిచే పాత్ర ఒకటి ఉంటుందని తెలుస్తోంది.
ఆ వెన్నుపోటుతోనే పుష్ప మొదటి భాగం పూర్తవుతుందని..ఎందుకు వెన్నుపోటు పొడిచాడు..ఏం జరిగింది అని చెప్పడమే రెండో భాగమని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ కట్టప్ప ఎవరు.. అల్లు అర్జున్ వెంటే ఉండి ఆ వెన్నుపోటు పొడిచే పాత్ర ఎవరు చేస్తున్నారు అనే విషయంపై మాత్రం చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే అన్ని చర్చలకు సమాధానం మాత్రం ఒకటే అని తెలుస్తోంది. ఆ కట్టప్ప ఎవరో కాదు సునీల్ (Sunil) యేనట. 20 ఏళ్ల కెరీర్ లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేసిన సునీల్.. పుష్ప సినిమాలో మాత్రం చాలా సీరియస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఇందులో ఆయన భార్య పాత్రలో అనసూయ భరద్వాజ్ కనిపిస్తుంది.
మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ ను వెన్నుపోటు పొడిచే పాత్ర సునీల్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఖచ్చితంగా ఈ సినిమా సునీల్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందని నమ్మకంగా చెబుతున్నారు ఆయన అభిమానులు. మరోవైపు సునీల్ కూడా తను వేచి చూసింది ఈ తరహా పాత్ర కోసమే అంటున్నాడు. ఏదేమైనా కూడా పుష్ప సినిమాలో వెన్నుపోటు ఎపిసోడ్ మాత్రం అదిరిపోతుందని ప్రచారం జరుగుతుంది. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది.
ఇవి కూడా చదవండి..
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Nayanthara Engagement| ఎంగేజ్మెంట్ అయిపోందని చెప్పిన నయనతార
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- Kattappa
- pushpa
- sukumar
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

