Pushpa Promotions | మరో 27 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సందడి మొదలు కానున్న విషయం తెలిసిందే. 3 ఏండ్లుగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందకు వస్తుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడటంతో మేకర్స్ భారీ ప్రమోషనల్ ఈవెంట్లను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా పుష్ప ఫీవర్ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఓవర్సీస్లో పుష్ప బుకింగ్స్ స్టార్ట్ అవ్వగా.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అయితే పాన్ ఇండియా వైడ్‌గా తెగ హైప్ ఉన్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ ఈవెంట్లను భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా ఇండియాలోని ఆరు పెద్ద నగరాలను మేకర్స్ సెలక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇందులో హైదరాబాద్‌తో పాటు, పాట్నా, ముంబై, కొచ్చి, చైన్నై, బెంగళూరులో పుష్ప ప్రీ రిలీజ్ జరుపబోతున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై మైత్రి మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా వస్తున్న ఈ చిత్రంలో రావు రమేష్, అజయ్, డాలీ ధనుంజయ, ఫహాద్ ఫజిల్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండగా.. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.