Pushpa 3 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం పుష్ప. తొలి పార్ట్ 2021లో రిలీజైంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది. ఇందులోని పాటలు, డైలాగులు, యాక్షన్ సీక్వెన్స్ లు పాన్ వరల్డ్ రేంజ్ లో ఫేమస్ కావడంతో పుష్ప2 చిత్రానికి క్రేజ్ పెరిగింది. ఇక ఈ మూవీ గత ఏడాది విడుదలై ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టింది. ఏకంగా రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక పుష్ప 2 సినిమా ఎండింగ్ లో పుష్ప 3 కూడా ఉంటుందని చిన్న హింట్ ఇచ్చారు మేకర్స్. 2028లో పుష్ప 3 సినిమాను విడుదల చేస్తామని రాబిన్ హుడ్ ప్రమోషన్లలో భాగంగా మైత్రి మూవీస్ నిర్మాత రవిశంకర్ చెప్పుకొచ్చారు.
అయితే బన్నీ, సుకుమార్ బిజీ షెడ్యూల్ చూస్తే పుష్ప 3 చిత్రం 2028కి రావడం డౌటే అనిపిస్తుంది. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కావాలంటే ఎలా లేదన్నా రెండేళ్లు పైన పడుతుంది. అట్లీ సినిమా పూర్తయ్యాక బన్నీ.. త్రివిక్రమ్‌తో ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఈ చిత్రం చేస్తే పుష్ప 3 అనుకున్న టైమ్‌కి రావడం కష్టం. అట్లీ సినిమానే దాదాపు 2027 దాకా చేసేలా కనిపిస్తుంది. ఇక త్రివిక్రమ్ చిత్రం ఎంత లేదన్న ఏడాదిన్నర సమయం తీసుకుంటుంది. మరి పుష్ప 3 ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది, ఎప్పుడు పూర్తై థియేటర్స్‌లోకి వస్తుంది. చూస్తుంటే 2028 లో పుష్ప 3 సాధ్యం కాదు సరికదా అసలు అప్పటికి సెట్స్ మీదకు వెళ్లడం గొప్పే అంటున్నారు.
అయితే పుష్ప2 భారీ విజయం సాధించిన నేపథ్యంలో పుష్ప 3 కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప రాజ్ మేనియాని మరోసారి తెర మీద చూసేందుకు ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. కాని బన్నీ కమిటైన సినిమాలని బట్టి చూస్తుంటే 2028లో పుష్ప3 రావడం కష్టమే అని తెలుస్తుంది. ఇక సుకుమార్ పుష్ప2 తర్వాత ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు. రామ్ చరణ్‌తో తన తదుపరి మూవీ చేయనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చరణ్.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది చేస్తున్నాడు. ఇది పూర్తయ్యాక సుకుమార్- రామ్ చరణ్ కాంబో ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.