‘పుష్ప’ సినిమా బాలీవుడ్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ చిత్ర రెండో భాగంలో అక్కడి ప్రేక్షకులు మరింత రిలేట్ అయ్యేలా హిందీ స్టార్‌ను ఓ కీలక పాత్ర కోసం ఎంచుకోవాలని చిత్ర బృందం భావిస్తున్నది. ఈ క్యారెక్టర్ అతిథి పాత్రగా ఉంటుందని సమాచారం. ‘పుష్ప’ ద్వితీయ భాగంలో ప్రతి నాయకుడిగా ఫహాద్ ఫాజిల్‌ను మార్చడం లేదని, ఆయనే మెయిన్ విలన్‌గా ఉంటారని టీమ్ మెంబర్స్ చెబుతున్నారు. అయితే ఓ కీలక పాత్రకు మాత్రం బాలీవుడ్ ఏ లిస్ట్ నటుడిని తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నామన్నది వారి మాట. ఇటీవల చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో సల్మాన్ ఖాన్ చేసిన గెస్ట్ రోల్‌కు మంచి పేరొచ్చింది. అలాగే ‘పుష్ప 2’ సినిమాను కూడా ఉత్తరాదికి మరింత చేరువచేసే నటుడు నటిస్తాడని తెలుస్తున్నది. ఈ సినిమా దీపావళి పండుగ ముందు ఈ నెల 20 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకుంటుందని సమాచారం.