Pushpa 2 The Rule Trailer | పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 నుంచి మరికొన్ని గంటల్లో ట్రైలర్ విడుదల కానుంది. ఎప్పుడెప్పుడా అని అటు అభిమానులతో పాటు ఇటు మూవీ లవర్స్ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇన్ని రోజులు ఉత్కంఠగా ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. ఈరోజు సాయంత్రం 6.03 గంటలకు బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ట్రైలర్‌ను మేకర్లు విడుదల చేయనున్నారు.
అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధనుంజయ్, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ & అజయ్ ఘోష్ శ్రీలీల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.