Pushpa 2 The Rule | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 ది రూల్ మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకుండానే పలు రికార్డులను ఈజీగా బ్రేక్ చేస్తోంది. ఇప్పటికే ప్రీ సేల్ బుకింగ్స్ ఓపెన్ చేయగా, అందులో ఈ మూవీ టికెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయి. అయితే ఈ మూవీ ఇప్పటివరకు పలు రికార్డులను నమోదు చేసింది.. ఆ రికార్డులు ఎంటో ఒకసారి చూద్దాం.
1. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 12000 స్క్రీన్స్‌లో విడుదల కానుంది. ఒక ఇండియన్ మూవీ ఈ స్థాయిలో విడుదలవ్వడం ఇదే మొదటిసారి కాగా.. ఇంతకుముందు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా 11000 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదల అయ్యింది.
2. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే 150 మిలియన్లు దాటిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ మూవీ ట్రైలరే కాకుండా.. పాటలు కూడా ఒక్కొకటి 100 మిలియన్లు వ్యూస్ సాధించాయి.
3. సినిమా బుకింగ్స్ వెబ్‌సైట్స్ బుక్ మై షోతో పాటు పేటిఏంలో ఈ సినిమా ఆల్‌టైం రికార్డు క్రియేట్ చేసింది. బుక్ మై షోలో ఈ సినిమా 1.7 మిలియన్ ఇంట్రెస్ట్‌లతో దూసుకుపోతుండగా.. పేటిఏంలో ఏకంగా.. 3 మిలియన్స్ ఇంట్రెస్ట్‌లను దాటింది. పేటిఏంలో ఈ రికార్డు సాధించిన మొదటి చిత్రంగా రికార్డుల కెక్కింది.
4. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇండియాలో స్టార్ట్ అవ్వగా.. కేవలం నార్త్‌లోనే 24 గంటల్లో లక్షకు పైగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఓవర్సీస్లో కూడా ప్రీ సేల్స్‌లోనే 1 మిలియన్ కలెక్షన్ సాధించిన మొదటి చిత్రంగా పుష్ప 2 రికార్డులకెక్కింది.
5. ఈ సినిమాకు టికెట్ ధరలు ఎక్కువ ఉన్న కానీ విడుదల కాకముందే అన్ని తెలంగాణతో పాటు నార్త్‌లో పలు థియేటర్లు హౌజ్ ఫుల్ బోర్డులు పెట్టడం విశేషం.
6. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ బీహార్‌లోని పాట్నాలో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు లక్షమందికి పైగా హాజరుకాగా.. హైయెస్ట్ లైవ్ వ్యూవర్స్ నమోదైన తొలి ఈవెంట్‌గా ‘పుష్ప2’ రికార్డు క్రియేట్ చేసింది.
7. సినీ విశ్లేషకుల ప్రకారం.. ఈ సినిమా మొదటిరోజే రూ.350 కోట్ల కలెక్షన్స్ రాబడుతుందని తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ రికార్డు ఆర్ఆర్ఆర్ సినిమా పేరిటా ఉంది. ఈ చిత్రం మొదటి రోజు రూ.275 కోట్ల వసూళ్లను రాబట్టింది.
8. ఇంకా ఇవే కాకుండా ఇండియాతో పాటు వరల్డ్ వైడ్‌గా మోస్ట్ పాపులర్ చిత్రంగా ఈ సినిమా రికార్డులకెక్కింది. ఈ సినిమా చూసి పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం అన్నవారిలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో పాటు షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, కరణ్ జోహార్, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్, ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తదితరులు ఉన్నారు. ఇక డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.