Pushpa 2 The Rule | టాలీవుడ్‌తోపాటు పాన్ ఇండియా, గ్లోబల్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ ఎక్జయిటింగ్ ప్రాజెక్ట్ పుష్ప ది రూల్ (Pushpa The Rule). సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో పుష్ప ప్రాంఛైజీలో వస్తున్న సీక్వెల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. కన్నడ భామ రష్మిక మందన్నా మరోసారి శ్రీవల్లిగా సందడి చేసేందుకు రెడీ అవుతోంది. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తు్న్నాడు.
తాజాగా పుష్ప ది రూల్ షూటింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం జూన్ 13 నుంచి షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం కానుంది. ఈ అప్డేట్తో ఫుల్ ఖుషీ అవుతున్నారు అభిమానులు. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో బన్నీ టీం ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది.
ఇప్పటికే రిలీజ్ చేసిన పుష్ప ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. మరోవైపు ఇటీవలే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో లాంఛ్ చేసిన పుష్ప సెకండ్ సింగిల్ సూసేకి Sooseki మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తూ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. పుష్ప ది రూల్‌లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సూసేకి లిరికల్ వీడియో సాంగ్..
కపుల్ సాంగ్ అనౌన్స్మెంట్..
అనసూయ భరద్వాజ్ దాక్షాయణి లుక్..
Wishing the talented @anusuyakhasba a very Happy Birthday ❤🔥
She will be back with #Pushpa2TheRule as the wily ‘Dakshayani’ 💥
Grand release worldwide on 15th AUG 2024.
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @PushpaMovie… pic.twitter.com/BqEIw1cfzA
— Mythri Movie Makers (@MythriOfficial) May 15, 2024
పుష్ప పుష్ప సాంగ్ ప్రోమో..
పుష్పరాజ్ ఎక్కడ..?
పుష్ప ది రూల్ టీజర్..