Pushpa 2 The Rule | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) నటించిన పుష్ప2( Pushpa 2 ) సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న విషయం తెలిసిందే. కేవలం బాలీవుడ్లోనే రూ.700 కోట్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం హిందీలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.
ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం మరో రికార్డును నమోదు చేసింది. ఈ చిత్రం కేవలం 21 రోజుల్లోనే రూ.1705 కోట్ల వసుళ్లను రాబట్టి రూ.2000 కోట్ల దిశగా దూసుకువెళుతుంది. అయితే ఇదే క్రేజ్ మరికొన్ని రోజులు ఉంటే ప్రభాస్ బాహుబలి 2 మీద ఉన్న అత్యధిక కలెక్షన్ల రికార్డును కూడా ఈ సినిమా చెరిపివేయనున్నట్లు తెలుస్తుంది. బాహుబలి 2 చిత్రం రూ.1800 కోట్ల వసూళ్లను సాధించి రెండో స్థానంలో ఉంది. దీనికంటే ముందు రూ.2300 కోట్లతో దంగల్ ఉంది. అయితే పుష్ప బాహుబలి 2 ని బీట్ చేయాలి అంటే పుష్ప 2 ఇంకో రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి. ఇప్పటికే ఈ సినిమా ఆన్లైన్లో లీక్ అవ్వడంతో మూవీ కలెక్షన్లపై భారీ ఎఫెక్ట్ పడింది. దీంతో ఈ రికార్డును కొడుతుందా లేదా అనేది చూడాలి.
THE HIGHEST GROSSER OF INDIAN CINEMA IN 2024 continues to topple records 💥💥#Pushpa2TheRule is the FASTEST INDIAN FILM EVER to collect 1700 CRORES with a gross of 1705 CRORES WORLDWIDE in 21 days ❤️🔥
Book your tickets now!
🎟️ https://t.co/tHogUVEgCt#Pushpa2#WildFirePushpa… pic.twitter.com/vrL2RHqcSq— Mythri Movie Makers (@MythriOfficial) December 26, 2024