Pushpa 2 The Rule | డిసెంబర్ 05న విడుదలయ్యే పుష్ప 2 ది రూల్ సినిమా కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. 6 భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ఓవర్సీస్ బుకింగ్స్ స్టార్ట్ అవ్వగా.. రికార్డు స్థాయిలో టికెట్స్ బుక్ అవుతున్నాయి. అయితే ఇండియాలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మూవీ బుకింగ్స్‌కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ నవంబర్ 30 మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇందులో తెలంగాణకు సంబంధించి మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఆంధ్రలో టికెట్ రేట్స్‌కి సంబంధించి ఇంకా చర్చలు పూర్తికాలేక పోవడం.. పుష్ప టీం అడుగుతున్న రేట్లను ఏపీ ప్రభుత్వం ఒప్పుకోకపోవడం దీనికి కారణం అని తెలుస్తుంది. కాగా దీనిపై రేపు క్లారిటీ రానుంది.