Pushpa 2 The Rule | డిసెంబర్ 05న విడుదలయ్యే పుష్ప 2 ది రూల్ సినిమా కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో పాటు యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా బుకింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయా ఎప్పుడు బుక్ చేద్దామా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ బుకింగ్స్ స్టార్ట్ అవ్వగా.. రికార్డు స్థాయిలో టికెట్స్ బుక్ అవుతున్నాయి. తాజాగా ఇండియాలో కూడా ఈ సినిమా బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఉదయమే నార్త్ బెల్ట్‌లో బుకింగ్స్ స్టార్ట్ అవ్వగా.. తెలంగాణకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్‌ను సాయంత్రం 4.56 గంటలకు ప్రారంభించారు. ప్రస్తుతం, పేటియం, బుక్ మై షోలతో పాటు, జోమాటోకి చెందిన డిస్ట్రీక్ట్ యాప్‌లో పుష్ప అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి.
మరోవైపు ఈ సినిమా టికెట్ల రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోలతో పాటు అర్ధరాత్రి 1 షోలకు అనుమతినిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సింగిల్ థియేటర్లలో, మల్టీఫ్లెక్స్‌ల్లో ఈ బెనిఫిట్ షోలకు టికెట్ ధరలు రూ.800గా ఖరారు చేసింది. మరోవైపు అర్థరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఎక్స్ట్రా షోలకు అనుమతినిచ్చింది.
డిసెంబర్ 05 నుంచి 08 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచింది. అలాగే.. డిసెంబర్ 09 నుంచి 16 వరకు సింగిల్ థియేటర్లలో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతిని ఇచ్చింది. డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ థియేటర్లలో రూ.20 మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దాదాపు 18 రోజులు ఈ పెంచిన రేట్లు అమలులో ఉండనున్నట్లు వెల్లడించింది. ఇక తెలంగాణ అడ్వాన్స్‌కు బుకింగ్‌కు సంబంధించి నేడు సాయంత్రం 4.56 గంటల నుంచి ప్రారంభం కానున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.
Get ready to ignite Pushpa’s wildfire with us 🔥 🔥
Bookings open in select cities, grab your tickets now: https://t.co/afxBd5KtTk#Pushpa2TheRule #Pushpa2TheRuleOnDec5th@PushpaMovie @MythriOfficial @MythriRelease @alluarjun @iamRashmika pic.twitter.com/8bn4oh7tVe
— District (@lifeindistrict) November 30, 2024