Pushpa 2 Reloaded | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa The Rule). సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటించింది. డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రూ.1850 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం రూ.2000 కోట్ల దిశగా దూసుకెళుతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి రీలోడెడ్ వెర్షన్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాలో విడుదలకు ముందు డిలీట్ చేసిన 20 నిమిషాలను మేకర్స్ ఈరోజు యాడ్ చేశారు. ముందుగా జనవరి 11న యాడ్ చేద్దామనుకున్నా అనుకోని కారణాల వలన జనవరి 17కి వాయిదా వేసింది. తాజాగా 20 నిమిషాల డిలీటెడ్ సీన్స్ థియేటర్ వెర్షన్లో కలిపింది.
అయితే ఈ సీన్స్‌లో ఒక హైలెట్ సీన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సీన్ ఎంటంటే.. పుష్ప పార్ట్ 1లో.. పుష్ప రాజ్(అల్లు అర్జున్) మెడలో ఉన్న లాకెట్‌ను అతడి అన్నయ్య (అజయ్) కోపంతో తీసుకోని వెళతాడు. అయితే అదే చైన్‌ను తీసుకువచ్చి పార్ట్ 2 క్లైమాక్స్‌లో పుష్పరాజ్ మెడలో వెస్తాడు అజయ్. ఈ సన్నివేశాన్ని విడుదల ముందు కట్ చేశారు మేకర్స్. మరోవైపు సుకుమార్ ఈ విషయం ఎలా మార్చిపోయాడు అంటూ విడుదల తర్వాత దీనిపై చర్చ కూడా జరిగింది. అయితే కొత్తగా యాడ్ చేసిన వాటిలో ఈ సీన్ కూడా ఉండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
Response
Pushpa getting his chain back is CINEMA#Pushpa2Reloaded #Pushpa2TheRule #AlluArjun pic.twitter.com/8dYQLvIPou— Nani sai (@alwaysnanisai2) January 17, 2025