Pushpa-2 | రెండు జాతీయ అవార్డుల రావడంతో పుష్ప సీక్వెల్‌పై అంచనాలు అమాంతం పెరిగాయి. బన్నీ ఫ్యాన్స్ సహా సినీ ప్రేమికులంతా సీక్వెల్ కోసం అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య రిలీజైన గ్లింప్స్ టాలీవుడ్ సహా అన్ని వుడ్‌లలోనూ ఊహించని స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా ఎప్పుడొచ్చిన బంపర్ హిట్టవడం ఖాయం అని అప్పుడే బాక్సాఫీస్ లెక్కలు కూడా వేసేస్తున్నారు. బన్నీ ఈ సారి వెయ్యి కోట్లు కొల్లగొట్టడం పక్కా అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. దానికి తగ్గట్టే సుక్కు సైతం సినిమాను వేరే లెవల్‌కు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇంకా రిలీజ్ డేట్ కూడా ఖరారు కానీ ఈ సినిమాకు కళ్లు చెదిరే ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తుంది.
పేరున్న ఓ హిందీ నిర్మాణ సంస్థ పుష్ప సీక్వెల్ కోసం ఏకంగా వెయ్యి కోట్లు ఆఫర్ చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల టాక్. థియేట్రికల్-నాన్ థియేట్రికల్ హక్కులు కలిపి ఈ రేంజ్లో ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ఓ సినిమాకు వెయ్యి కోట్ల బిజినెస్ జరుగుతుందంటే ఆశా మాశీ కాదు. అది కూడా ఓ తెలుగు సినిమా అంటే నిజంగా చరిత్ర సృష్టించినట్లే. ఇక పుష్ప సీక్వెల్‌ను వచ్చే ఏడాది మార్చి లేదంటే సమ్మర్లో రిలీజ్ చేయాలని ప్లాన్లు చేస్తున్నారట.
ప్రస్తుతం సీక్వెల్‌కున్న క్రేజ్ చేస్తుంటే కొంచెం పాజిటీవ్ టాక్ వచ్చినా ఊహకందని రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయం అనిపిస్తుంది. మేకర్స్ సైతం తొందరపడి నిర్ణయం తీసుకోకుండా సరైనా ప్లానింగ్‌తోనే డేట్‌ను ఫిక్స్ చేయాలని చూస్తున్నారట. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. రష్మిక హీరోయిన్గా నటిస్తుంది. ఇక బెస్ట్ యాక్టర్‌గా బన్నీకు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవికి నేషనల్ అవార్డులు రావడంతో సినిమాపై వీర లెవల్లో అంచనాలు నెలకొన్నాయి.