‘పుష్ప-2’తో బాక్సాఫీస్ రికార్డుల అంతుచూసే పనిలో ఉన్నారు అల్లు అర్జున్. తొలిరోజు భారీ వసూళ్లను రాబట్టి, రికార్డులు సృష్టించే దిశగా ‘పుష్ప-2’ దూసుకుపోతున్నది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తర్వాతి సినిమాపై ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చలు మొదలయ్యాయి. ‘పుష్ప-2’ ఎండింగ్లో ‘పుష్ప3’కి లీడ్ ఇచ్చినా.. బన్నీ వెంటనే చేసే సినిమా మాత్రం ‘పుష్ప 3’ కాదని సమాచారం. ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నెక్ట్స్ సినిమా చేయనున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌లో త్రివిక్రమ్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. పుష్ప ఫ్రాంచైజీతో మారిన బన్నీ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని, పాన్ ఇండియా రేంజ్లో ఉండే కథను రాసుకుంటున్నారట త్రివిక్రమ్. ఏడు వందల కోట్ల భారీ వ్యయంతో హారిక, హాసిని ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తున్నది.
బన్నీతో త్రివిక్రమ్ చేయబోతున్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇదే కావడంతో.. త్రివిక్రమ్ తయారు చేస్తున్న కథపై ఫిల్మ్ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. మైథలాజికల్ టచ్ ఉండే కథతో ఈ సినిమా రూపొందనున్నదని ఓ టాక్. మరోవైపు మంగోలియా యోధుడు చెంఘీజ్‌ఖాన్ చరిత్రలోని కీలకమైన ఎపిసోడ్‌తో త్రివిక్రమ్ ఈ కథ తయారు చేస్తున్నారని, ఇది హిస్టారికల్ మూవీ అని కూడా టాక్ నడుస్తున్నది. మరి ఈ రెండింటిలో ఏది నిజం? అనేది తెలియాల్సివుంది.