విదేశాలకు ‘పుష్ప-2’
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ‘పుష్ప-2’ (ది రూల్) చిత్రంపై భారీ అంచనాలేర్పడ్డాయి. అల్లు అర్జున్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గత నెలలో విడుదల చేసిన ‘హంట్ ఫర్ పుష్ప’ కాన్సెప్ట్ వీడియో సోషల్‌మీడియాలో రికార్డు వీక్షణలతో సంచలనం సృష్టించింది.
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ‘పుష్ప-2’ (ది రూల్) చిత్రంపై భారీ అంచనాలేర్పడ్డాయి. అల్లు అర్జున్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గత నెలలో విడుదల చేసిన ‘హంట్ ఫర్ పుష్ప’ కాన్సెప్ట్ వీడియో సోషల్ మీడియాలో రికార్డు వీక్షణలతో సంచలనం సృష్టించింది. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లి, ఒడిశా పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నదని తెలిసింది. ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు.. ఈ షెడ్యూల్ అనంతరం విదేశాల్లో షూటింగ్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. యూరప్‌తో పాటు బ్యాంకాక్‌లో కొన్ని కీలకమైన ఎపిసోడ్స్‌ను తెరకెక్కించబోతున్నారని సమాచారం. రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, ధనుంజయ, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

