Pushpa 2 Prasads | హైదరాబాద్ మల్టీప్లెక్స్‌లో ఒక్క సినిమా అయిన చూడాలని ప్రతి ప్రేక్షకుడు కోరుకుంటాడన్న విషయం తెలిసిందే. అత్యాధునిక హంగులు.. సూపర్ సౌండింగ్.. లగ్జరీ సీటింగ్‌తో భారీ తెరలపై సినిమా చూస్తే ఆ అనుభూతి చెప్పలేనిది. ఇలాంటి అనుభూతిని హైదరాబాద్ నగరవాసులకు మొదట పరిచయం చేసింది ప్రసాద్స్ మల్టీప్లెక్స్. ప్రసాద్స్‌లో ఫస్ట్ డే సినిమా చూస్తే చాలు ఫ్యాన్స్‌తో పాటు సినిమా ప్రేక్షకులకు ఎదో తెలియని ఆనందం. ఇక సినిమా విడుదలయ్యాక అది హిట్టా లేదా ఫట్టా అనేది తెలిసేది కూడా ఈ థియేటర్లోనే. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వంటి మాస్ థియేటర్లు ఉన్న కూడా ప్రేక్షకుల ఎక్కువగా ప్రసాద్‌నే ఇష్టపడతారు. అయితే టాలీవుడ్ నుంచి ఏ పెద్ద హీరో వచ్చిన ఇందులో భారీ ఎత్తున విడుదలవుతుంది అన్న విషయం తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం కూడా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అవ్వగా.. ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడయిపోయాయి.
ఇదిలావుంటే.. ఇప్పటివరకు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో ఓపెన్ అవ్వలేదు. గత నాలుగు రోజులు నుంచి అభిమానులు కూడా ప్రసాద్స్‌లో ఎప్పుడు స్టార్ట్ అవుతాయా ఎప్పుడూ బుకింగ్ చేద్దామా అని ఆతృతతో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం విశేషం. దీనికి కారణం ఏంటి అని చూస్తే.. ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యంకు.. ‘పుష్ప 2’ నిర్మాతలు మైత్రి మూవి మేకర్స్‌కి ఇంకా డీల్ కుదరట్లేదు అని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రసాద్ నుంచి ఎక్కువ షేర్ మైత్రి అడిగినట్లు సమాచారం. దీంతో ప్రసాద్ నిర్వహాకులు ఒప్పుకోకపోవడంతో బుకింగ్స్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈరోజు సాయంత్రం వరకు అయిన వీరిద్దరి మధ్య ఉన్న సమస్యలు చర్చించుకోని ప్రీమియర్స్‌కి బుకింగ్స్ ఓపెన్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.