రాజ్‌తరుణ్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘పురుషోత్తముడు’. హాసిని సుధీర్ కథానాయిక. రామ్ భీమన దర్శకుడు. డా.రమేశ్ తేజావత్, ప్రకాశ్ తేజావత్ నిర్మాతలు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ని శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. నిర్మాతల అభిరుచి వల్లే ఈ విజయం సాధ్యమైందని, ప్రేక్షకుల నుంచి కూడా అద్భుతమైన స్పందన వస్తున్నదని, పూల రైతుల సమస్యలకు తెరరూపం ఇవ్వడం మేం చేసిన వినూత్న ప్రయత్నమని దర్శకుడు చెప్పారు. తెలుగుదనం ఉట్టిపడే పాత్రను ఇచ్చి పోత్సహించిన దర్శక, నిర్మాతలకు కథానాయిక హాసిని కృతజ్ఞతలు చెప్పింది. సినిమా విజయం పట్ల నిర్మాతలు ఆనందం వెలిబుచ్చారు. ఇంకా సినిమాటోగ్రాఫర్ పి.జి.విందా కూడా మాట్లాడారు.