Puri Jagannadh | టాలీవుడ్ అగ్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమాలను తెరకెక్కించడమే కాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫిలాసఫీ పేరిటా పాడ్ కాస్ట్‌లు చేస్తాడన్న విషయం తెలిసిందే. పూరి మ్యూజింగ్స్(Puri Musings) అనే పేరుతో పూరీ తన భావాలను వివిధ అంశాలపై మాట్లాడుతుంటాడు. ఈ విషయాలను యూట్యూబ్ వేదికగా అప్లోడ్ చేస్తూ ఉంటాడు. దీనికి ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ ఉంది. గత వారం ‘కన్జ్యూమింగ్’ అనే అంశంపై మాట్లాడిన తాజాగా మరో కొత్త ఫిలాసఫీతో మందుకు వచ్చాడు. ఈ వారం ‘స్లో లైఫ్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ప్రస్తుతం ప్రపంచంలో మనందరం పరుగులు పెడుతూ బ్రతుకుతున్నాం. ప్రతి రోజు మనకి డెడ్ లైన్స్ ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ చేస్తూ ఊపిరి ఆడకుండా పరిగెడుతున్నాం. కాన్స్టంట్ రేస్ విత్ ది క్లాక్. స్లో లైఫ్ ఇస్ ఏ లైఫ్ స్టైల్ ఫిలాసఫీ. దట్ ప్రమోట్స్ క్వాలిటీ ఓవర్ క్వానిటీ. మన డైలీ లైఫ్ స్పీడ్ తగ్గించి బతకడం నేర్చుకోవాలి. స్లోయింగ్ డౌన్ యువర్ వర్క్. ఉదయాన్నే మంచం మీద నుంచి ఉల్లిక్కి పడి లేవటం మంచం మీద నుండి బాత్రూమ్ లోకి దూకడం ఆ తర్వాత వీధిలోకి దూకడం కాదు. మెల్లగా లేచి కాలకృత్యాలు తీర్చుకొని.. వీలైతే ఒక గంట యోగ చేసి.. టైం తీసుకొని మెల్లగా బ్రేక్ ఫాస్ట్ చేసి బయలుదేరటం. ఇది బద్దకంగా ఉండమని చెప్పడం కోసం కాదు. ప్రతి పనికి దానికి ఇవ్వాల్సిన టైం దానికి ఇచ్చి ఆ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తూ బతకడం. 10 సెకండ్లలో బ్రష్ చేయటం, రెండు నిమిషాలలో స్నానం చేయడం. నాలుగు గంటల్లో నిద్ర నుంచి లేచిపోవడం మానేయాలి.
ఈ కాన్స్టంట్ రషింగ్ వలన ప్రెషర్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. స్లోయింగ్ డౌన్ వల్ల మీ బ్రెత్ మారుతుంది. కామ్ స్టేట్ ఆఫ్ మైండ్ అలవాటు అవుతుంది. లైఫ్ స్లో చేయడం వల్ల మీ కాన్వర్సేషన్స్ బెటర్ అవుతాయి. మీ రిలేషన్స్ బెటర్ అవుతాయి. మీ ఫ్యామిలీ తో కూర్చున్నప్పుడు కాసేపైనా ప్రశాంతంగా కూర్చోగలిగితే ఒకరికొకరు అర్థమవుతారు. లేకపోతే మీ ఇంట్లో అందరికీ మీరు సస్పెన్స్ లా తయారవుతారు. స్లోయింగ్ డౌన్ మేక్స్ యు మోర్ ప్రోడక్టివ్( మీరు నెమ్మదించడం వలన ఇంకా ప్రోడక్టివ్‌గా తయరవుతారు). మీ క్రియేటివిటీ పెరుగుతుంది. పరీక్షలు బాగా ప్రిపేర్ అవుతారు. మైండ్ లేకుండా మీరు ఎంత పరుగులు పెట్టినా ఏ ఉపయోగం లేదు. కాసేపు ప్రశాంతంగా ఆ సముద్రం పక్కన కూర్చోగలిగితే సూర్యోదయం, సూర్యాస్తమం ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ స్లో లైఫ్ వల్ల ప్రతి రోజు అందాన్ని చూడొచ్చు. ప్రతి మూమెంట్‌ని ఎంజాయ్ చేయవచ్చు. అందుకే అవుట్ డోర్స్ లో ఎక్కువ గడపండి. క్వాంటిటీ కంటే క్వాలిటీ కోసం ట్రై చేయండి. అనవసరమైనవి కట్ చేస్తే మంచిది.
వంట చేయడానికి తినటానికి కాస్త టైం ఇవ్వండి. కాసేపు మీరు పెంచుకునే కుక్కతో ఆడుకోండి. అప్పుడప్పుడు మీ ఆలోచనలు పెన్‌తో పేపర్ మీద రాయండి. అలా నడవండి లేదా సైకిల్ తొక్కండి. ఇలా చేయడం వలన మనం బతికే రోజులు పెరగకపోయినా.. ఉన్న రోజులైనా క్వాలిటీగా బతుకుతాం. సాధారణంగా స్లో లైఫ్ అనేది అందరూ చేయలేరు. డబ్బు ఉన్నవాడు అయితే ఇది ఈజీగా చేయగలడు. మరి డబ్బు లేనోడు.. ఆర్థిక కష్టాల్లో ఉంటూ ఇవన్నీ చేయగలమా అని మీకు డౌట్ వస్తుంది. కానీ మీరు చేయవచ్చు. మీరు రోజు ఒక గంట లేదా రెండు గంటల ముందు లేవగలిగితే ఇవన్ని చేయవచ్చు. దీ ఆర్ట్ ఆఫ్ స్లోయింగ్ డౌన్ మేక్స్ యు బెటర్ పర్సన్ (నీ డైలీ లైఫ్ స్పీడ్ తగ్గించి బతకడం వలన నువ్వు ఇంకా బెటర్ అవుతావు). అంటూ పూరి చెప్పుకోచ్చాడు.