టాలీవుడ్ (Tollywood) యువ హీరో ఆకాశ్‌పూరీ (Akash Puri) నటిస్తోన్న చిత్రం ‘రొమాంటిక్’ (ROMANTIC). ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కథ, కథనం, సంభాషణలు అందిస్తుండగా..అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ను పూరీ జగన్నాథ్ సోషల్ మీడియా ద్వారా అందించాడు.
హాయ్..ఆకాశ్, కేతిక శర్మ (Ketika Sharma) నటించిన రొమాంటిక్ చిత్రం అనుకున్న దానికంటే ముందుగానే అక్టోబర్ 29న థియేటర్లలో మీరంతా చూడొచ్చు. అలాగే ఈ సినిమా ట్రైలర్‌ను డార్లింగ్ ప్రభాస్ రేపు సాయంత్రం లాంఛ్ చేయబోతున్నాడు. తప్పక చూడండి అంటూ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశాడు పూరీ. ఈ మూవీలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా వస్తున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించాడు. మకరంద్ దేశ్‌పాండే, ఉత్తేజ్, సునయన కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్‌తో కలిసి పూరీజగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముంబై భామ కేతిక శర్మహీరోయిన్ గా నటిస్తోంది.
ఇది కూడా చూడండి
Chiranjeevi | మోహన్‌బాబుకు చిరంజీవి పిలుపు
చాలా విషయాల్లో బైలాస్ మారుస్తాం: మంచు విష్ణు
Jacqueline Fernandez | నాలుగోసారీ ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన బాలీవుడ్ నటి