Puri Jagannadh New Podcast | అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్ మరో కొత్త పాడ్ కాస్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూరి మ్యూజింగ్స్ (Puri Musings) అనే పేరుతో పూరి తన భావాలను వివిధ అంశాలపై మాట్లాడుతుంటాడు అన్న విషయం తెలిసిందే. ఈ విషయాలను యూట్యూబ్ వేదికగా పాడ్‌కాస్ట్ (ఆడియో) అప్లోడ్ చేస్తూ ఉంటాడు. దీనికి ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ ఉంది. తాజాగా ఆటోఫేజీ (Autophagy) అంటూ ఆరోగ్యంపై పాడ్‌కాస్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
గ్రీక్ నుంచి వచ్చిన పదం ఆటో ఫేజీ. ఆటో అంటే సెల్ఫ్, ఫేజీ అంటే తినడం. సెల్ఫ్ ఈటింగ్ అని అర్థం. ఇది మన శరీరంలో జరిగే ఒక సహజ ప్రక్రియ. మన బాడి తనకు తానే చేసుకునే ఒక ప్రక్షళన. ఈ సెల్యులర్ మెకానిజం మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఎక్కువ కాలం బ్రతికేలా సహాయం చేస్తుంది. మన బాడీలో ఉన్న పనికిరాని సెల్స్‌ని లేదా డామేజ్డ్ సెల్స్ ని మన బాడినే తినేస్తది. అవసరం లేని సెల్స్‌ని ఇది తినేస్తుంది. ఆటోఫేజీ అనేది మన శరీరంను రీసైక్లింగ్ చేసుకునే ఒక మార్గం. మన ఆరోగ్యానికి హాని కలిగించే ఏ సబ్‌స్టాన్స్ ఉన్నా దాన్ని ఇది తినేస్తుంది. అలాగే డామేజ్డ్ ప్రోటీన్స్ ఉంటే వాటిని కూడా తీసేస్తుంది. ఈ ఆటో ఫేజీ వలన మన మెటబాలిజం పెరుగుతుంది అలాగే ఎనర్జీ యాడ్ అవుతుంది. మన ఏజింగ్ ప్రాసెస్ స్లో డౌన్ అవుతుంది. ముఖ్యంగా చాలా వ్యాధులు క్యాన్సర్ లాంటివి రాకుండా చూస్తుంది.
అయితే ఈ ఆటోఫేజీ ఎప్పుడు జరుగుతుంది అంటే.. మనం ఉపవాసం ఉన్నప్పుడు.. లేదా ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన శరిరంలో ఆటో ఫేజ్ పని చేస్తుంటుంది. ఇంకొకటి హీట్ అండ్ కోల్డ్ థెరపీ మీరు సానా(టర్కీ బాత్) వాడినప్పుడు.. లేదా చల్లని వాటర్‌లో దిగినప్పుడు ఈ ఆటో ఫేజీ యాక్టివేట్ అవుతుంది. ఆటో ఫేజీ వలన మన లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. మన హెల్త్ బెటర్ అవుతుంది. అందుకే మన పెద్దలు ఉపవాసాలు అవి అలవాటు చేశారు మీరు కూడా ఏదో దేవుడి పేరు చెప్పి అప్పుడప్పుడు ఉపవాసాలు చేస్తే ఎంతో మంచిది. మీ ఇమ్యూన్ సిస్టం పెరుగుతది బ్రెయిన్ ఫంక్షన్ మారుతుంది. ప్రతి రోజు ఎక్సర్సైజ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం చాలా మంచిది. మన టిష్యూలు రిపేర్ అయ్యి మన బాడీలో హీలింగ్ ప్రాసెస్ పెరుగుతుంది. యోష్నోరి అని ఒక జపాన్ లో ఒక బయాలజిస్ట్ ఉన్నాడు ఈ ఆటో ఫేజీ గురించి అతనే ముందు కనుకున్నాడు. ఈ విషయంలో అతడికి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఉపవాసాలు ఎక్సర్సైజ్లు, చన్నీళ్లతో స్నానాలు చేయడం వలన మీ బాడీలో ఆటో ఫేజీ యాక్టివేట్ అయ్యి మీరు ఆరోగ్యంగా ఉంటారు. దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే మీ డాక్టర్ని అడగండి. అంటూ పూరి చెప్పుకోచ్చాడు.