Puri Jagannath | పూరీ జగన్నాథ్ ప్రస్తుతం ముంబైలో ఉన్నారట. అక్కడ కొత్త కథకోసం కసరత్తులు చేస్తున్నారని వినికిడి. అయితే.. ఆయన నెక్ట్స్ సినిమా ఏ హీరోతో అనేది మాత్రం ఇప్పటివరకూ క్లారిటీ లేదు. అయితే.. తాజాగా ఈ విషయంపై ఓ వార్త చక్కర్లు కొడుతున్నది. పూరీ జగన్నాథ్ నెక్ట్స్ సినిమా గోపీచంద్‌తో ఉంటుందట. పూరీ, గోపీచంద్ కలిసి 2010లో ‘గోలీమార్’ సినిమా చేశారు. అప్పట్లో ఆ సినిమా బాగానే ఆడింది.
మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరూ కలిసి పనిచేయనున్నారనేది ఈ వార్త సారాంశం. ఇది ‘గోలీమార్’కు సీక్వెల్‌గా ఉంటుందని కూడా అంటున్నారు. ‘గోలీమార్’లో హీరో క్యారెక్టరైజేషన్ బావుంటుంది. దానిచుట్టూ కొత్త కథను నడపొచ్చని పూరీ భావిస్తున్నట్టు ఫిల్మ్‌వర్గాల టాక్. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేశ్ నిర్మించే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది మూడు సినిమాలు నిర్మించాలనేది ఆయన ప్లాన్. వాటిలో ‘గోలీమార్ 2’ ఒకటని సమాచారం.