ఇటీవలే హఠాన్మరణం చెందిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar)కు అరుదైన గౌరవం దక్కింది. కర్ణాటక ప్రభుత్వం పునీత్ రాజ్‌కుమార్‌ను మరణానంతరం కర్ణాటక రత్న అవార్డు (Karnataka Ratna Award)తో సత్కరించాలని నిర్ణయించినట్టు సీఎం బస్వరాజు బొమ్మై (Basavaraj Bommai) వెల్లడించారు. కన్నడ సినీ పరిశ్రమతోపాటు పునీత్ రాజ్‌కుమార్ అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ..కర్ణాటక ప్రభుత్వం అత్యున్నత పురస్కారం కర్ణాటక రత్న అవార్డును ఆయన కుటుంబ సభ్యులకు ప్రదానం చేయనున్నారు.
మంగళవారం Puneeth Namana పేరుతో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డును అందజేయనున్నారు. బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో జరుగనున్న ఈ కార్యక్రమానికి మంత్రులు, పలువురు రాజకీయ వేత్తలు, కన్నడ సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. పునీత్ రాజ్ కుమార్ అక్టోబర్ 29న గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో కన్నడ సినీ పరిశ్రమతోపాటు యావత్ సినీ ప్రపంచం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ಕನ್ನಡನಾಡಿನ ಜನಪ್ರಿಯ ಕಲಾವಿದ ದಿವಂಗತ ಶ್ರೀ ಪುನೀತ್ ರಾಜಕುಮಾರ್ ಅವರಿಗೆ ಮರಣೋತ್ತರ ಕರ್ನಾಟಕ ರತ್ನ ಪ್ರಶಸ್ತಿ ನೀಡಿ ಗೌರವಿಸಲು ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ತೀರ್ಮಾನಿಸಿದೆ.
— Basavaraj S Bommai (@BSBommai) November 16, 2021
State Government has decided to honour late Sri #PuneethRajukumar with Karnataka Ratna award posthumously.#KarnatakaRatna
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Jhanvi Kapoor | జాన్వీకపూర్ ఫాలోవర్లకు బ్యాడ్ న్యూస్..!
Shyam Singha Roy Vs Ghani | గని నిర్మాతల తీరుతో శ్యామ్ సింగరాయ్ వెనకడుగేస్తాడా..?
Prakash Raj silence | నా గొంతుకు వారం విశ్రాంతి..ప్రకాశ్‌రాజ్ ట్వీట్ వైరల్
Biker Naatu Naatu Dance | ట్రాఫిక్ సిగ్నల్‌లో బైకర్ ‘నాటు నాటు’ డ్యాన్స్ ..వీడియో హల్చల్