కన్నడ లెజెండరీ యాక్టర్ రాజ్ కుమార్ తనయుడుగా శాండల్ వుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పునీత్ రాజ్ కుమార్ తన టాలెంట్‌తో పవర్ స్టార్ అని పిలిపించుకుంటున్నాడు. పునీత్ మంచి డ్యాన్సర్ కూడా కావడంతో ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆయన అస్వస్థతకు గురయ్యారు.
పునీత్ రాజ్ కుమార్ జిమ్‌లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందని తెలపడంతో ఆయన్ను బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు.పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యం మరింత విషమించడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు వైద్యులు. ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.