జబర్దస్త్ షోలో తన కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్వించే పంచ్ ప్రసాద్ (Punch Prasad) గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెర వెనుక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నా.. అందరినీ నవ్విస్తూ.. తన బాధను మరిచిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడు. పంచ్ ప్రసాద్ కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పంచ్ ప్రసాద్‌కు తాజాగా మరో సమస్య వచ్చి పడ్డది.
పంచ్ ప్రసాద్ పరిస్థితి ప్రస్తుతం ఇంకా ఇబ్బందికరంగా మారిందని, ఇపుడు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడని నూకరాజు తెలియజేశాడు. పంచ్ ప్రసాద్ పరిస్థితికి సంబంధించిన విషయాన్ని యూట్యూబ్ ఛానల్లో షేర్ చేశాడు నూకరాజు. పంచ్ ప్రసాద్ కాళ్లకు వాపు రాగా.. కనీసం నడవలేకపోతున్నట్టు వీడియోతో ద్వారా అర్థమవుతుంది.
నడుము నొప్పితో చాలా ఇబ్బంది పడ్డాడు. ఎందుకిలా జరిగిందో అర్థం కాలేదని డాక్టర్లు అన్నారని, పరీక్షలు చేసిన తర్వాత నడుము వెనకవైపు కుడికాలు వరకు చీము పట్టినట్టు తెలిసిందని చెప్పాడు నూకరాజు. ప్రసాదన్నకు ఇష్టం లేకపోయినా ఈ వీడియో యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్నానని, అందరి ఆశీస్సులుండాలని, ఆయనకు సపోర్ట్ ఇవ్వాలని కోరాడు నూకరాజు.