పులివెందుల మహేశ్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన విభిన్న కథాచిత్రం ‘స్కూల్ లైఫ్’. గంగాభవాని నిర్మాత. ఈ నెల 14న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి ఈ సినిమా తీశామని, కథే ఈ చిత్రానికి హీరో అని, ఈ సినిమా టికెట్ కేవలం వంద రూపాయలు మాత్రమే ఉంటుందని దర్శకుడు, హీరో పులివెందుల మహేశ్ తెలిపారు.
ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన ప్రముఖ నటుడు సుమన్ మాట్లాడుతూ ‘నా మనసుకు దగ్గరైన సినిమా ఇది. ఇందులో రైతుగా నటించాను. టైటిల్ మాదిరిగానే ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇది.’ అని పేర్కొన్నారు. ఇంకా కథానాయికలు షన్ను, సావిత్రి కూడా మాట్లాడారు. ఆమని, మురళీధర్‌గౌడ్ ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: జి.జి.ధర్మ, సంగీతం: షేక్ బాజీ, నిర్మాణం: నైనిషా క్రియేషన్స్.