PS-2 Movie Telugu Pre-Release Event | మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్స్‌లో ‘పొన్నియన్ సెల్వన్-2’ ఒకటి. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక గతేడాది సెప్టెంబర్ చివరివారంలో రిలీజైన పార్ట్-1 ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమిళనాట కాసుల వర్షం కురిపించింది. డిస్ట్రిబ్యూటర్లకు కళ్లు చెదిరే లాభాలు తీసుకొచ్చింది. అయితే మిగితా భాషల్లో మాత్రం బోటా బోటీ మార్కులతోనే సరిపెట్టుకుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సీక్వెల్‌పై కోలీవుడ్‌లో యమ క్రేజ్ ఉంది. ఈ సినిమా మరో వారం రోజుల్లో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే బుకింగ్స్ ఓపెనవగా.. టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
ఇప్పటికే ప్రమోషన్లలో జోరు చూపిస్తున్న చిత్రబృందం ఇప్పుడు తెలుగు ప్రమోషన్లకు సిద్ధమైంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నోవోటల్‌లో ఆదివారం సాయంత్రం ఘనంగా జరుగనుంది. ఈ మేరకు చిత్రబృందం ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమాను తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. హిస్టారికల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మణిరత్నం కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కించాడు. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మ్రదాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.
Don’t miss the grand arrival of Cholas in Hyderabad!
Join us on April 23rd at 5:30 PM at Novotel Hyderabad Convention Centre.#PS2 in cinemas worldwide from 28th April in Tamil, Hindi, Telugu, Malayalam, and Kannada!#CholasAreBack#PS2 #PonniyinSelvan2 #ManiRatnam @arrahman… pic.twitter.com/37Zr2XHhXD— Sri Venkateswara Creations (@SVC_official) April 22, 2023